విశ్వమంతా ప్రేమను పంచిన క్రీస్తు
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మిర్యాలగూడ నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ” క్రిస్మస్ అంటే ఏసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ,సహనం, కరుణ పూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ ఏసు బోధనలను ఆదరించే సందర్భం. ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి ఏసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుంది. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర,సోదరీమణులలో శాంతి, సామరస్యం విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులంతా భక్తి, శ్రద్ధలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని క్రైస్తవ సోదర,సోదరీమణులను ఆకాంక్షిస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ, మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు.” అని భాస్కర్ రావు తన సందేశాన్ని తెలిపారు.