*ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు*
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
అక్షిత ప్రతినిధి, మిర్యాలగూడ:
లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ప్రజలందరికీ క్రిస్ పర్వదినం సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్త మానవాళికి ప్రేమ, కరుణ, దయ, శాంతి మార్గం చూపిన ఏసుక్రీస్తు జన్మదినం క్రైస్తవ సోదర,సోదరీమణులకు పర్వదినమన్నారు.పరోపకారంతో పాటు సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలనే యేసయ్య సందేశాలను అందరూ ఆచరించాలన్నారు. సర్వశక్తిమంతులు,మహోన్నతులు యేసుక్రీస్తు తన చల్లని దీవెనలతో ప్రతి ఒక్కరినీ సన్మార్గంలో నడిపించాలని ఆయన ఆకాంక్షించారు.