రైలుపై విసిరిన రాయి… పగిలిన ఏసీ కోచ్ అద్దాలు

 

రైళ్లపై రాళ్లు విసిరే వారిపై సమాచారం అందించాలి
*ఆర్పీఎఫ్ ఎస్సై పవన్ కుమార్ రెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రైళ్లపై రాళ్లు విసిరే దుండగుల గురించి ప్రజలు రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని మిర్యాలగూడ రైల్వే ఎస్సై జి పవన్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 17న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నరసాపూర్ -సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలుపై మిర్యాలగూడ-నల్గొండ మార్గంలో గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడని దీంతో ఏసీ కోచ్ అద్దాలు పగిలాయని ఆయన తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. రైలు పట్టాల వెంబడి తిరిగే అపరిచిత వ్యక్తుల గురించి అనుమానితుల గురించి సమీప గ్రామాల ప్రజలు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking