

ప్రధాన రోడ్డుపై ఆక్రమణలు తొలగించిన అధికారులు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలో రోడ్డుపై ఆక్రమణలను పోలీసు పర్యవేక్షణలో సోమవారం తొలగించారు. పట్టణంలోని రాజీవ్ చౌక్ నుండి బంగారుగడ్డ వరకు రోడ్డుకిరువైపులా డ్రైనేజ్, ఫుట్ పాత్ పై ఉన్నఆక్రమణలను జెసిబితో తొలగించారు. సుమారు 80 అడుగులు నూతన రోడ్డును విస్తరించేందుకు గాను ఇరువైపులా 20 అడుగుల వరకు వెడల్పు చేసేందుకు ఆయా దుకాణదారులు, ఇళ్ల యజమానులకు నోటీసులిచ్చారు. మార్కింగ్ ప్రకారం భవనాలను కూల్చకుంటే తాము కూలుస్తామని నోటీసులో పేర్కొన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ ఇంజనీర్ సాయి లక్ష్మి, ఆర్ అండ్ బి ఎఇ రాంబాబు, టిపిఓ సోమయ్య, టిపిఎస్ ఎండి.అక్బర్, సానిటరి ఇన్స్పెక్టర్ వెంకటరమణలు పాల్గొన్నారు.