పల్లెల రహదారులకు మహర్దశ

పల్లెల రహదారులకు మహర్దశ

రూ.78లక్షలతో‌రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
పల్లెల రహదారులకు మహర్దశ లభించింది. అంతర్గత రహదార్లను మెరుగు పరిచేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ మండలంలో ఆర్‌అండ్ బి రోడ్డు నుంచి సామ్యగానితండ గ్రామం వరకు 68 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి, శ్రీనివాస్ నగర్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎంపిపి నూకల సరళ హనుమంతరెడ్డి గార్లతో కలిసి‌ మంగళవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఆర్ అండ్ బి రోడ్డు నుంచి సామేగాని తండ వరకు రోడ్డు నిర్మాణం తీవ్ర జాప్యానికి గురైందని దానిని ఇప్పుడు సాకారం చేసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ప్రజల కోరిక మేరకు సామేగాని తండాను గ్రామపంచాయతిగా చేసుకోవడం జరిగిందని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని గ్రామపంచాయతీలలో మౌలిక సదుపాయాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ చిట్టిబాబు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు భోగవెల్లి వెంకటరమణ చౌదరి, సర్పంచ్ డి.సైదా నాయక్, ఎంపిటిసి ఇ.సుజాత బాలునాయక్, చిలుకూరి సత్యనారాయణ, మాజీ ఎఎంసి డైరెక్టర్ పులి జగదీష్, సైదానాయక్, శ్రీహరి నాయక్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పిసికె ప్రసాద్, మాజీ ఎంపిటిసి వి.గోవిందు, పంచాయతి రాజ్ శాఖ డిఇఇ ముత్తవరపు వెంకటేశ్వర రావు, ఎఇఇ చిల్లంచర్ల ఆదినారాయణ, బిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking