
ఆపద్బాంధవుడు… సీఎం కేసిఆర్
సిఎం ఆర్ఎఫ్ కింద 41మందికి రూ.21.05లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మిర్యాలగూడ నియోజక వర్గ వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆర్ధిక సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా 41 మందికి మంజూరైన 21 లక్షల 5 వేల రూపాయల విలువ గల చెక్కులను రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, మిర్యాలగూడ, అడవి దేవులపల్లి ఎంపిపిలు నూకల సరళ హనుమంతరెడ్డి, డి.బాలాజీ నాయక్ తో కలిసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు లబ్దిదారులకు చెక్కులను పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక సిఎం ఆర్ఎఫ్ ను మరింత పటిష్ట పరిచి చాల పకడ్బందిగా దరఖాస్తు పెట్టుకున్న ప్రతిఒక్కరికి ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. పేద , మధ్య తరగతి కుటుంబాలకు సిఎం కెసిఆర్ కొండంత అండను ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, ఎ.హాతిరాం నాయక్, డి.రవితేజ నాయక్, ఇరుగు వెంకన్న, వైస్ ఎంపిపి అమరావతి సైదులు, బిఆర్ఎస్ మండల పార్టి అధ్యక్షులు బాబయ్య, అడవిదేవులపల్లి మండల రైతు బంధు సమితి అధ్యక్షులు సూర్యానాయక్, ఎంపిటిసిలు, సోము సైదిరెడ్డి, బాలునాయక్, సర్పంచ్లు బానావత్ లలిత సక్రు నాయక్, అశోక్ రెడ్డి బారేడ్డి, రామచంద్రు, మరెడ్డి, భీమా నాయక్, రమణ, నాయకులు వజ్రం, తులసిరాం,మేక రవి, పందిరి ప్రతాప్, నాగిరెడ్డి కందుల, పాచునాయక్, గుర్రం భాస్కర్రెడ్డి, సేవానాయక్, బైరం గోపి పాల్గొన్నారు.