పాఠశాలకు మౌలిక వసతులు

 

పాఠశాలకు మౌలిక వసతులు

మన బస్తీ-మన బడి కింద రూ.4.06కోట్లతో నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ మానస పుత్రిక అయిన మన-ఊరు మన బడి- మన బస్తీ-మన బడి పథకం కింద రూ.4.06కోట్ల రూపాయలు వ్యయంతో తరగతి గదులు నిర్మాణ‌ పనులకు మంగళవారం‌ స్థానిక శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని11 వ వార్డు నందిపహాడ్ ప్రాధమిక పాటశాల నందు 70 లక్షల 74 వేల 678 రూపాయలతో, 36 వ వార్డు మెయిన్ బజార్ ప్రాధమికొన్నత పాఠశాల గాంధీ పార్క్ లో 1కోటి‌ 88 లక్షల 39 వేల 598 రూపాయలతో అదేవిదంగా 34 వ వార్డు గాంధీనగర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1 కోటి 46 లక్షల 90 వేల 747 రూపాయల వ్యయంతో నిర్మాణ పనులకు తెలంగాణ అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నారని తెలిపారు. మొదటి దఫా కింద నియోజక వర్గములో 70 పాఠశాలలు పునరుద్ధరించటానికి 40 కోట్ల 68 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని మిగతా పాఠశాలలను రెండవ దశలో చేర్చి వాటిని కూడ అభివృద్ధి చేస్తామని తెలిపారు. మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం కింద ప్రతి పాఠశాలలో నిరంతరం నీరు, మరుగుదొడ్లు, విద్యుత్, మంచినీరు, ఫర్నీచర్, ప్రహరీ గోడలు, వంట గది, అదనపు గదుల మరమ్మతులు, డిజిటల్ తరగతులు వంటి అన్ని సదుపాయాలు కల్పిండమే కాకుండా ఆధునిక వసతులు ఉండేలా చూసి పాత భవనాలను అధునీకరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎంపిపి నూకల సరళ హనుమంతరెడ్డి, ఎఎంసి మాజీ చైర్మన్ చిట్టిబాబు, బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కర్నే ఇందిరా గోవింద్రెడ్డి, ఉబ్బపల్లి వెంకమ్మ సోములు, అన్నభీమోజు నాగార్జునచారి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్దూంపాషా, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, పాలరాపు సత్యనారాయణ, మన్నెం లింగారెడ్డి, ఉబ్బపల్లి మధుసూదన్రావు, సాధినేని శ్రీనివాసరావు, మాలోతు రవీందర్, వీరారెడ్డి, నల్లగంతుల నాగభూషణం, వంశీ, సుధాకర్, వెంకటేశ్వర్లు, శ్రీహరి, ఎంఇఒ మాలోతు బాలాజీ నాయక్, పంచాయతి రాజ్ శాఖ డిఇఇ ముత్తవరపు వెంకటేశ్వరరావు, ఎఇఇ చిల్లంచర్ల ఆదినారాయణ, బిఆర్ఎస్ నాయకులు, వార్డు ప్రజలు, మహిళలు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking