
ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం
ప్రజల వద్దకు ఆర్టీసి సేవలు
డిఎం పాల్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
వేములపల్లి మండలం అన్నపరెడ్డిగూడెం ఎక్స్ రోడ్డు వద్ద మిర్యాలగూడ డిపో మేనేజర్ బి.పాల్, ఎస్టిఐ వీరబాబు, స్టేషన్ మాస్టర్ బిక్షమమ్మ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మిల్లు యజమానులు, సిబ్బంది మాట్లాడుతూ హైదరాబాదు దూర ప్రాంతాలనుండి మిల్లులకు వచ్చేవారు హైదరాబాదు, సూర్యాపేటకు తిరిగి వెళ్లేవారు ప్రతినిత్యం చాలామంది ఉన్నారని బస్సులను ఆపి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించగలరని డిఎంని కోరగా డీఎం పాల్ మాట్లాడుతూ సూర్యాపేట డిపో బస్సులను స్టేజి వద్ద ఆపే విధంగా సూర్యాపేట డిపో మేనేజర్ తో మాట్లాడి మిల్లుల యజమానులు, సిబ్బంది కోరిక మేరకు దూర ప్రాంతాలకు వెళ్లే వారికై ప్రతి బస్సును అన్నపురెడ్డిగూడెం ఎక్స్ రోడ్డు వరకు మిర్యాలగూడ డిపో పరిధిలోని ప్రతి బస్సును చెయ్యెత్తినచోట ఆపి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సమయ పొదుపు, ప్రయాణ సౌకర్యం కల్పిస్తొమన్నారు. అందరు ప్రతినిత్యం ఎక్కడికి వెళ్లాలన్నా బస్సులోనే సురక్షితంగా క్షేమంగా ప్రయాణిస్తూ, ఆదరిస్తు ఎదుగుదలకు తోడ్పడగలరన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు మిల్లు యజమానులు, సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.