
ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం
* ఆపద్బాంధవుడు ‘కేసీఆర్’
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్ ) నిరుపేదలకు వరమని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కొనియాడారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవ్యాప్తంగా 41 మంది
బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.21లక్షల 5 వేలు విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, హాతిరాం నాయక్, ధీరావత్ రవితేజ నాయక్, ఇరుగు వెంకన్న, వైస్ అమరావతి సైదులు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాబయ్య, అడవిదేవులపల్లి మండల రైతు బంధు సమితి అధ్యక్షులు సూర్యా నాయక్, ఎంపీటీసీలు, సోము సైది రెడ్డి, బాలు నాయక్, సర్పంచ్ లు బానావత్ లలిత సక్రు నాయక్, అశోక్ రెడ్డి బారెడ్డి, రామచంద్రు, మారెడ్డి, భీమా నాయక్, రమణ, నాయకులు వజ్రం, తులసీరాం,మేక రవి, పందిరి ప్రతాప్, నాగిరెడ్డి కందుల, పాచు నాయక్, గుర్రం భాస్కర్ రెడ్డి, సేవా నాయక్, బైరం గోపి తదితరులు పాల్గొన్నారు.