వడివడిగా ప్రగతి అడుగులు

వడివడిగా అడుగులు

* మిర్యాలగూడ సమగ్రాభివృద్దే లక్ష్యం
* అడవిదేవులపల్లి మండలంలోని12గ్రామాలకు రూ.2 కోట్ల 40లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పునరుధ్ఘటించారు. అడవిదేవులపల్లి మండలంలోని అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, జిలకరకుంట తండ, కొత్తనందికొండ, బాల్నేపల్లి, చిట్యాల, చాం ప్లలాబీ తండ, గోన్య తండ, ఉల్సాయిపాలెం, బంగారికుంట తండ, నల్లమిట్ట తండ, నడిగడ్డ గ్రామాలకు ఎస్డీఫ్ గ్రాంట్స్ ద్వారా ఒక్కో గ్రామానికి 20 లక్షల చొప్పున మొత్తం రూ.2కోట్ల 40లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధుల ద్వారా అడవిదేవులపల్లి మండలంలోని 12 గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో జిల్లా డీసీ ఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గం పూడి నారాయణ రెడ్డి ఎంపీపీ బాలాజీ నాయక్, జడ్పీటీసీ కుర్ర సేవ్యా నాయక్, మాజీ ఎంపీపీ కురాకుల మంగమ్మ, మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల చినరామయ్య, పంచాయతీ రాజ్ శాఖ డీఈ వెంకటేశ్వర్ రావు, మండల పార్టీ కార్యదర్శి కుర్ర శ్రీను, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొత్త మర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking