కోనప్ప… నీ గుండాగిరికి చెక్

నా ఫోన్ ట్యాప్ చేస్తున్న బిఆర్ఎస్, బిజెపి పార్టీలు

*ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
నీ గుండాగిరి నడవదు

*పల్లా రాజేశ్వర్ రెడ్డి
రైతులకు క్షమాపణ చెప్పాలి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,

కొమరం భీమ్ ఆసిఫాబాద్, అక్షిత ప్రతినిధి :

బిఆర్ఎస్,బిజెపి ప్రభుత్వాలు, కుట్రపూరితంగా ప్రశ్నించే గొంతును అణచివేయడానికి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నాయని నా ఆపిల్ మొబైల్ కూడా ట్యప్ చేస్తున్నారని యాపిల్ సంస్థ నాకు మెయిల్ పంపిందని డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నానని,బహుజన రాజ్యం కోసం పోరాటం చేయడం జీర్ణించుకోలేక, రోజురోజుకు బిఎస్పికి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.బిఎస్పి పార్టీ అంటే ఎందుకింత భయమని ప్రశ్నించారు.ఇజ్రాయెల్ వంటి దేశాల నుండి వందల కోట్లతో అత్యాధునిక సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించిన జర్నలిస్టులు,ప్రజాసంఘాల నాయకులు,రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, బిజెపి,బిఆర్ఎస్ కలిసి ఈ పని చేస్తున్నాయని ఆయన తెలిపారు.300ల రోజుల
బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా ఈ రోజు 154వ రోజు యాత్ర కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ప్రారంభమైంది.యాత్రలో భాగంగా కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ,రైతు స్వరాజ్య వేదిక నాయకులను ఉద్దేశించి తెలంగాణ మంత్రి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు,లేదంటే బిఆర్ఎస్ పార్టీని రైతులు,ప్రజలే ఉరికిచ్చి సాగనంపుతారని హెచ్చరించారు.తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ దొంగల కోసమేనని ఆయన విమర్శించారు.ధరణితో వందల ఎకరాలు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.బహుజన రాజ్యంలో ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు.తెలంగాణ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి,సర్వే పేరుతో కాలయాపన చేస్తుందని,గిరిజనులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.

అదేవిధంగా పెరిగిన జనాభా ప్రకారం బిసి,ఎస్సి,ఎస్టి మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.మైనారిటీల వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందని పేర్కొన్నారు.
పోలీస్ రిక్రూట్ మెంట్ లో ఎస్ఐ,కానిస్టేబుల్ నియామకాల్లో ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిందన్నారు. వెంటనే లాంగ్ జంప్ ఈవెంట్ రద్దుచేసి,షాట్ పుట్,రన్నింగ్ చేసిన వారికి తుది పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు.బిఎస్పి పార్టీ జెండాలు కడితే తీసేస్తున్నారని ఆరోపించారు.ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
నియోజకవర్గంలో పేదల భూములను,నోటిఫైడ్ భూములను ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.కోనేరు కోనప్పకు ధైర్యం ఉంటే అభివృద్ధి పనులపై దమ్ముంటే చర్చకు రావాలని,పిరికిపంద చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.గుట్కా దందాలు,సర్పంచులను సస్పెండ్ చేసి బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు.బిఆర్ఎస్ పార్టీ అవినీతిని ప్రజలకు విప్పి చెప్పి అక్రమంగా సంపాదించిన సొమ్మంతా అమరవీరుల స్థూపం ముందు కక్కిస్తామని హెచ్చరించారు.
యాత్రలో భాగంగా సంజీవయ్య కాలనీ,కౌసర్ నగర్,అంబేడ్కర్ చౌక్,ఎస్.పి.ఎం పేపర్ మిల్ ప్రాంతాల్లో పర్యటించారు.చెక్ పోస్టు నుండి అంబేడ్కర్ చౌక్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.అంబేడ్కర్ చౌక్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల అర్పించారు. యాత్రలో భాగంగా ఇతర పార్టీల నుండి మహిళలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సీడం గణపతి,జిల్లా అధ్యక్షులు ఆకుల.సంతోష్ కుమార్,నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్,నియోజకవర్గ అధ్యక్షులు రాంప్రసాద్,ట్రెజరర్ నవీన్,మహిళా కన్వీనర్ సీడం జ్యోతి,అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking