ఎంపీ రవిచంద్రకు శుభాకాంక్షల వెల్లువ

*నూతన సంవత్సరం సందర్భంగా ఎంపీ రవిచంద్రకు వెల్లువెత్తిన శుభాకాంక్షలు*

*రవిచంద్రను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసిన మున్నూరుకాపు ప్రముఖులు పురుషోత్తం, బూర్గంపాడు సర్పంచ్ స్వప్న*

*తరలివచ్చిన ఖమ్మం యువత,సీనీ హీరో పవన్ కళ్యాణ్ తో తాను ఉన్న ఫోటోను ఆవిష్కరించిన ఎంపీ రవిచంద్ర*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజు సోమవారం కూడా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,భద్రాది కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామ సర్పంచ్ స్వప్న తదితరులు ఎంపీ రవిచంద్రకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఖమ్మం నగరానికి చెందిన యువనేతలు పాల్వంచ రాజేష్, గౌరీశెట్టి వినోద్,ఆకుల సాయి,భానుప్రతాప్ తదితరుల నాయకత్వంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువకులు ఎంపీ వద్దిరాజుకు పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ రవిచంద్ర, ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ లు ఇటీవల హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిసిన సందర్భంలో తీసిన ఫోటోలతో కూడిన చిత్రపటానికి రాజేష్ రూపకల్పన చేయగా, దానిని రవిచంద్ర ఆవిష్కరించారు.ఎంపీని కలిసిన వారిలో గుమ్మడెల్లి ప్రశాంత్,టింకూ,తుపాకుల సాయి,మిర్యాల నరుణ్ తేజ్, పెంట్యాల రామకృష్ణ,రాజచౌదరి,దేవభక్తిని నవీన్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking