బాధిత కుటుంబానికి ఆసరా

మృతుడు కుటుంబానికి ఆర్థిక సహాయం

ద్యప నిఖిల్ రెడ్డి డిఎన్ ఆర్

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :

ఊరుకొండ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాకలి పెద్ద అంజయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మరణించడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు అనిల్ ద్వారా తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ద్యప నిఖిల్ రెడ్డి వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ దహన సంస్కారానికి 5000 రూపాయలు గ్రామ నాయకులు అనిల్ ద్వారా వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనిల్, జంగి రెడ్డి, ఆంజనేయులు, రాము, పవన్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking