కొవ్వొత్తుల సమర్పణ

ప్రారంభమైన చర్చి దేవాలయ జాతర

మునుగోడు, అక్షిత, ప్రతినిధి:

యేసు క్రీస్తు చర్చి జాతర ఘనంగా ప్రారంభమైన యేసు నామకరణ దేవాలయ ఉత్సవాలు ఆదివారం మండల పరిధిలోని కమ్మగూడెంలో ప్రతి ఏడాది ఆనవాయితీగా సమర్పించే కొవ్వొత్తుల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలో ప్రతి ఒక్కరు కొవ్వొత్తులు వెలిగించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బ్యాండ్ మేళాలు వాయిస్తూ, బాణసంచ కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.అనంతరం యేసు నామకరణ కళా వేదిక నందు సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ విచారణ గురువులు, సంఘ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking