
దేశ ప్రధానిగా కెసిఆర్ ని చూడాలి
ముప్పది మూడు జిల్లాల సందర్శన యాత్ర ప్రారంభించిన సిద్దిపేట జిల్లా వాసి
జి . మనోహర్
మునుగోడు అక్షిత, ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఈ దేశ ప్రధానిగా చూడాలని మునుగోడు మండల కేంద్రం లోభారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి 33 జిల్లాల సందర్శన యాత్ర జి మనోహర్ ప్రారంభించారు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని భారత దేశ ప్రధానిగా చూడాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలను సందర్శించి తన జిల్లా అయిన సిద్దిపేట కు చేరుకుంటానని ఆ జిల్లా వాసి గజిబిన్కర్ మనోహర్ బీఆర్ఎస్ పార్టీ అభిమాని అభిమానాన్ని చాటుకున్నారు.