పల్లెలు ప్రగతికి సోపానాలు

పల్లెలు ప్రగతికి సోపానాలు

* రూ.20 లక్షల నిధులతో ఇస్కబావి గూడెం గ్రామపంచాయతీ
భవనానికి శంకుస్థాపన

నలమోతు భాస్కర్ రావు 
మాడుగులపల్లి, అక్షిత న్యూస్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలకు మహర్దశ వచ్చిందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తి,వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు తెలిపారు.

బుధవారం మాడ్గులపల్లి మండలంలో ఇస్కబావి గూడెం గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో నిర్మించతలాపెట్టిన నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మాడ్గులపల్లి మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, పాక్స్ చైర్మన్ జెర్రిపోతుల రాములు  గౌడ్, సర్పంచ్ నిమ్మల గోవిందమ్మ, అలుగుబెల్లి గోవింద్ రెడ్డి, మారుతి వెంకట్ రెడ్డి, పోరెడ్డి కోటిరెడ్డి, కర్ర ఇంద్రారెడ్డి, ఉప సర్పంచ్ భిక్షం, ఎంపీటీసీ అంజిరెడ్డి సీతారాం రెడ్డి, నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, స్థల దాత కట్ట అనంత్ రెడ్డి, జడ రాములు, జానిమియా, వార్డు మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking