
పల్లెల ప్రగతితోనే దేశాభివృద్ధి
* మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్దే లక్ష్యం
* మాడుగులపల్లి మండలంలో రూ.4కోట్ల 34 లక్షల వ్యయంతో 10కిలో మీటర్ల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మాడుగులపల్లి, అక్షిత న్యూస్ :
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.

మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మాడుగులపల్లి మండలంలో పోరెడ్డిగూడెం, పాములపహాడ్-బీరెల్లిగూడెం వరకు చిరుమర్తి గ్రామం గుండా రూ.4 కోట్ల 34 లక్షల నిధులతో 10 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రెన్యూవల్ బీటీ రోడ్డు నిర్మాణం పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నల్లమోతు భాస్కర్ రావు బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మాడ్గులపల్లి మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, పాక్స్ చైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్, సీనియర్ నాయకులు పొనుగోటి చొక్కారావు, సర్పంచ్లు అలుగుబెల్లి గోవింద్ రెడ్డి, మారుతీ వెంకట్ రెడ్డి, పోరెడ్డి కోటిరెడ్డి, శ్రీశైలం, యాదయ్య, కర్ర ఇంద్రారెడ్డి, ఆగా అఫ్జాల్, శ్రీనివాస్ రెడ్డి, యతం నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ కళింగ రెడ్డి, కూరెళ్ళ వెంకటా చారి, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.