” బంధు”తో ఆర్థిక పరిపుష్టి

“బంధు”తో ఆర్థిక పరిపుష్టి

మినీ సూపర్ మార్కెట్, మినీ డైరీ యూనిట్ల పరిశీలన

ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాస్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

దళితుల ఆర్థిక పరిపుష్టికి దళిత బంధు ఉద్దీపనగా మారిందని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్. శ్రీనివాస్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని రోళ్ళకల్ లో దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసిన 39 యూనిట్లను పురోగతిని పరిశీలించారు. మినీ సూపర్ మార్కెట్, మినీ డైరీ, ట్రాక్టర్ అండ్ ట్రాలీ, గూడ్స్, గొర్రెల పెంపకం తదితర యూనిట్లను పరిశీలించారు. పాడి గేదెలతో తొలుత 4 గేదెల చొప్పున కోనుగోలు చేయగా ప్రతి రోజు 15 నుంచి 20 లీటర్ల పాలు వస్తుండడం మా కుటుంబానికి ఆదాయం లభిస్తుందన్నారు. అదేవిధంగా రెండవ విడత గేదెల కోనుగోలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాక్టర్, గూడ్స్ తదితర యూనిట్ల లబ్దిదారులతో ముచ్చటించారు. ప్రతి నెల ఖర్చులు మినహాయించి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు లాభం ఆర్జిస్తున్నట్లు చెప్పడం, మినీ సూపర్ మార్కెట్ నుంచి కూడా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు మిగులుతుందని చెప్పారు. మిగిలిన నిధులతో 2వ దశకు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దళితుల ఉజ్వల భవిష్యత్తుకు దళిత బంధు ఉద్దీపనగా నిలువనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయా యూనిట్ల నుంచి వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల నుంచి లావాదేవీలను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ది అధికారి మోహన్ రెడ్డి, పంచాయతి కార్యదర్శి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking