
సంక్షేమ, అభివృద్దిలో
రోల్ మోడల్ గా తెలంగాణ
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
మర్రిగూడలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం ప్రారంభించిన వైద్య, ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు
మునుగోడు, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల అమలులో దేశానికి రోల్ మోడల్ గా వుందని,ఇతర రాష్ట్రాలు,కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్లు, వైద్య సిబ్బందిని కోరారు.

మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలో 5 కోట్ల రూ. ల అంచనా వ్యయం తో నిర్మించిన సామాజిక ఆరోగ్యం కేంద్రం నూతన భవనం ను మంత్రి హరీష్ రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పనతో పాటు, డాక్టర్లను,వైద్య సిబ్బందిని నియమించి బలోపేతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు 2022 డిసెంబర్ 31న రాష్ట్ర వ్యాప్తంగా 950 మంది డాక్టర్లను కొత్తగా నియమించినట్లు తెలిపారు. అందులో నల్గొండ జిల్లాలో వివిధ ఆస్పత్రిలో 42 మందిని కొత్త గా డాక్టర్ నియమించినట్లు, మర్రి గూడ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎనిమిధి మంది డాక్టర్లను నియా మకం చేసినట్లు తెలిపారు. వీరంతా జనవరి ఒకటిన విధులలో చేరినట్లు ఆయన వెల్లడించారు. డాక్టర్లను నియామకం, సదుపాయాలు కల్పించి ఈ ఆస్పత్రి ని ఈ రోజు ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు గతంలో హామీ ఇచ్చినట్టు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం నల్గొండ హైదరాబాద్ వెళుతున్న రోగులకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసినట్లు డిజిటల్ ఎక్స్ రే యంత్రం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోరినట్లు గర్భిణీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించేందుకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ ను,గైనిక్ డాక్టర్ ను నియామకం చేయనున్నట్లు ప్రకటించారు.నేత్ర,డెంటల్,పీడియాట్రిక్ డాక్టర్లు ఆసుపత్రి లో సేవలు అందిస్తారని అన్నారు.కేటరాక్ట్ పరీక్షలు కూడా ఆసుపత్రి లో నిర్వహిస్తారని ఆయన అన్నారు.కొత్తగా జనవరి ఒకటిన విధులలో చేరిన 8 మంది డాక్టర్లను సభా ముఖంగా మంత్రి పరిచయం చేశారు.
నల్గొండ జిల్లాలో 59 శాతం ప్రభుత్వ ఆసుపత్రులలో,41 శాతం ప్రైవేట్ ఆసుపత్రులలో డెలివరీ లు జరుగుతున్నాయని,రాష్ట్రం లో సరాసరి 66 శాతం ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ లు జరుగుతున్నాయని,ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ లు పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ను ఆయన ఆదేశించారు .జిల్లా 60 శాతం సిజెరియన్ ఆపరేషన్ లు జరుగుతున్నట్లు,సిజేరియన్ లు తగ్గించి సాధారణ ప్రసవాలు చేసేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని అన్నారు.సి.సెక్షన్ లో వలన తల్లి,బిడ్డల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని,ఇన్ఫెక్షన్ లు ,రక్త స్రావం,ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు.పుట్టిన బిడ్డకు మొదటి గంట లోనే తల్లి ప్రాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరిగి,చురుగ్గా ఆరోగ్యం గా ఉంటారని అన్నారు.34 శాతం తల్లులు మాత్రమే బిడ్డలకు పుట్టిన మొదటి గంటలో తల్లి పాలు త్రాగి స్తున్నారని అన్నారు. తల్లిపాలు అమృతం తో సమానం అని,తల్లి పాలు తాగిన బిడ్డలు ఆరోగ్య వంతమైన భావి పౌరులుగా పెరుగుతారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నట్లు తెలిపారు. నల్గొండలో బత్తాయి మార్కెట్, నకిరేకల్ లో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో,సంకల్పంతో నల్గొండ ,సూర్యా పేటలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు,అన్ని సౌకర్యాలు కల్పించి డాక్టర్ లు,వైద్య సిబ్బందిని నియమించి నట్లు తెలిపారు. టిఫా స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేసినట్లు, ప్రతి గర్భిణీ కి నాలుగు సార్లు ఏ.ఎన్.సి.చెక్ అప్ చేయాలని అన్నారు.ఆసుపత్రి లో డెలివరీలు జరిగితే కె సి.అర్ కిట్ అందిస్తున్నట్లు, త్వర లోనే కె సి.ఆర్ న్యూట్రిషన్ కిట్ అందించ నున్నట్లు తెలిపారు. బి.పి.,షుగర్ కిట్ లు వైద్య సిబ్బంది పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఒక్క ఖాళీ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని,కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఊడగొడుతు ప్రభుత్వ రంగ సంస్థలు బి.ఎస్.ఎన్.ఎల్,ఎల్. ఐ.సి.,రైల్వే లను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని అన్నారు.
మునుగోడ్ ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా మర్రి గూడ గ్రామం లో సి.సి.రోడ్లు,మురికి కాలువల నిర్మాణం కు 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం లకు ఖబరిస్తాన్ కు పోయే దారి ఏర్పాటు సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.సగం లో నిర్మాణం ఆగిన ఎస్.సి. కమ్యునిటీ హాల్ నిర్మాణం కు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.లూజ్ పోల్ లు,మిడిల్ పోల్ లు,రెండు ట్రాన్స్ఫార్మర్ లు ఏర్పాటు సమస్య పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్. ఈ. ని ఆదేశించారు.కొన్ని మిగిలిన పెన్షన్ లు మండలం లో, గ్రామంలో మంజూరు చేస్తామని చెప్పారు.శివన్న గూడెం రిజర్వాయర్ శివన్న గూడెం, లక్ష్మణాపురం,చర్ల గూడెం నిర్వాసితులకు ప్లాట్ లకు భూమి గుర్తించి నట్లు,శివన్న గూడెం రిజర్వాయర్ పరిధిలో సమస్యలు పరిష్కరించేందుకు నాలుగు రోజుల్లో ఆర్థిక శాఖ,ఇరిగేషన్ శాఖ,అధికారులతో హైద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసి చర్చించ నున్నట్లు తెలిపారు. బోర్ బావిల దగ్గర మీటర్ లు పెట్ట లేదని సంవత్సరం కు 6 వేల కోట్ల రూ లు,గత రెండు సంవత్సరం లు గా 12 వేల కోట్ల రూ లు రూ.లు,5 సం ల లో కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూ.లు నిధులు బంద్ చేసిందని అన్నారు. కరోనా సంక్షోభం లో కూడా పెన్షన్ లు,రైతు బంధు ఆన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కొనసాగించి నట్లు తెలిపారు.
జనవరి 18 నుండి రాష్ట్రంలో గ్రామ గ్రామాన 300 కోట్ల రూ.లు ఖర్చు పెట్టే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్టం సరిహద్దు రాష్ట్రాల ప్రజలు,దేశం నుండి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తున్నారని ఆయన అన్నారు. గతంలో గుండె సంబంధిత సమస్య కు తమిళనాడుకు వెళ్ళే వారని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు వైద్య రంగం లో తీసుకు వచ్చిన నిర్ణయాలు, మార్పుల కారణంగా ప్రజలకు వైద్యరంగం పై నమ్మకం పెరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లివర్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందు బాటులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదని అన్నారు.రాష్ట్రం లో అమలు చేస్తున్న రైతు బంధు,24 గంటల ఉచిత విద్యుత్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అమలు చేయాలని కోరుతున్నట్లు, దేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి చర్చించు కుంటున్నరని అన్నారు. ఏ.పి.ప్రజలు,దేశం యావత్తూ కె.చంద్ర శేఖర్ రావు నాయకత్వం కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,వైద్య విధాన కమిషనర్ డా.అజయ్ కుమార్, శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు.