ప్రభుత్వ పథకాలపై అవగాహన

ప్రభుత్వ పథకాలపై అవగాహన

గౌరిశంకర్ సైకిల్ యాత్ర షురూ

హైదరాబాదు, అక్షిత ప్రతినిధి :

ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు బి రాజమౌళి పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించుకునే ఉద్దేశ్యంతో పొన్నాల గౌరీశంకర్ (65) చేపట్టిన సైకిల్ యాత్రను మాసబ్ టాంక్ లోని సమాచార భవన్ నుంచి ఆయన ప్రారంభించారు. అల్వాల్ కు చెందిన గౌరీ శంకర్ బ్రహ్మచారి. ఆరోగ్యం, పర్యావరణం, పచ్చదనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించటకు 2000 సంవత్సరం నుండి దేశ వ్యాప్తంగా గౌరీ శంకర్ సైకిల్ యాత్ర చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడతానని గౌరీ శంకర్ ఈ సందర్భంగా తెలిపారు. రోజుకు 60 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయనున్నట్లు తెలిపారు. యాత్రలో భాగంగా యువకులు , విద్యార్థులతో ముచ్చటించి ఆరోగ్యం పర్యావరణం మరియు విద్య ప్రాధాన్యత గురించి వివరిస్తాను అని తెలిపారు. అలాగే దారి పక్కన ఉండే నర్సరీల నుంచి పండ్లు, పూల మొక్కలు సేకరించి సమీపంలోని గ్రామాల్లో నాటిస్తానని తెలిపారు. సైకిల్ యాత్రలో భాగంగా స్థానిక అధికారులు , ప్రజాప్రతినిధులను కలువనున్నట్లు తెలిపారు.
60 రోజుల పాటు కొనసాగే ఈసైకిల్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లీ, సంయుక్త సంచాలకులు డి యస్ జగన్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking