
*మంత్రి గంగులకు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ పరామర్శ*
కరీంనగర్, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర బిసి సంక్షేమ మరియు ఆహార పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) బుధవారం మరణించగా, గురువారం రోజున మంత్రులు తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో ని గంగుల కమలాకర్ నివాసానికి వెళ్లి మల్లయ్య గారి పార్థివ దేహం పై పూలమాల వేసి నివాళులార్పించారు. గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మంత్రులతో వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కరీంనగర్ తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపెల్లి మోహన్, బి.ఆర్.ఎస్.వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉన్నారు.