
సీఎం సహాయ నిధి… పేదలకు అపద్భంధువు
* ఆపద్బాంధవుడు ‘కేసీఆర్’
నల్లమోతు సిద్దార్ధ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్ ) నిరుపేదలకు వరమని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ కొనియాడారు. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో బండవాత్ తండా (గేర్ తండా) గ్రామానికి చెందిన బిజ్జానాయక్ గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గ్రామ సర్పంచ్ లింగమ్మ సేవా నాయక్ ఎమ్మెల్యే భాస్కర్ రావు దృష్టికి తీసుకొని వచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2,50,000 విలువైన ఎల్వోసీ చెక్కు బిజ్జా నాయక్ కు మంజూరైంది. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో నల్లమోతు సిద్దార్ధ బాధిత
కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం నల్లమోతు సిద్దార్ధ మాట్లాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని నల్లమోతు సిద్దార్ద తెలిపారు.