సంక్రాంతి వేళ… ఆనందాల సిరులు

తెలుగు  సిరుల పండుగ సంక్రాంతి
* అందరి లోగిళ్ళలో ఆనంద సిరులు వెల్లివిరియాలి
* మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు 

నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

#తెలుగు వారి సిరుల పండుగ, భోగ భాగ్యాల పండుగ సంక్రాంతి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ శుభవేళ అందరి లోగిళ్ళలో ఆనంద సిరులు వెల్లివిరియాలని ఆయన అభిలషించారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలని భాస్కర్ రావు కోరారు. ప్రజల జీవితాల్లో నిత్యం కాంతులు విరాజిల్లేలా దేవతలంతా దీవించాలని, ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతీ ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరియాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలందరికీ భోగి…భోగభాగ్యాలను కలిగించాలని, మకర సంక్రాంతి…మనందరికీ సకల సంపదలు కలిగించి సుఖసంతోషాలతో తులతూగేలా చేయాలని, కనుమ….సకల జనుల, సబ్బండ వర్గాల కన్నుల పండువ కావాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల వల్ల రైతులందరి ఇండ్లు పాడిపంటలతో సుఖసంతోషాలతో వెల్లివిరియాలని కోరారు. ప్రజల్లో దాగివున్న చెడు
భోగి మంటల్లో పూర్తిగా నశించి ప్రజలంతా ఆయుర్ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు.

1 Comment
  1. 전주출장마사지 says

    Normally I do not read article on blogs, however I would
    like to say that this write-up very forced me to check out
    and do it! Your writing style has been surprised me. Thanks, very great article.

Cancel Reply

Your email address will not be published.

Breaking