ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేత
కూకట్‌పల్లి, అక్షిత ప్రతినిధి:
ఆల్విన్ కాలనీ సర్కిల్ వెంకటేశ్వర్ నగర్ డివిజన్ హనుమాన్ నగర్‌లో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముహిని ఎంటర్‌ప్రైజెస్, నజీరుద్దీన్ సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోటిముక్కల వెంకటేశ్వరరావు, మాధవరం రంగారావు విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు.వారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను,సహకారం అందించిన నజీరుద్దీన్‌ను అభినందించారు. అలాగే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించడం ఒక ముఖ్యమైన దశ అని, భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్,టీ.నర్సింలు, బాలు యాదవ్, ఆర్.ఎం.రాజు, ఎర్రన్న, వెంకటేష్,వీరేష్,టైల్స్ శ్రీనివాస్, పరమేష్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, రాములు, లోహిత్, దశరథ్,విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీవాసులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.