వేగం కన్నా ప్రాణం మిన్న

వాహనదారులకు హెచ్చరిక..

వేగం కన్నా ప్రాణం మిన్న
సంక్రాంతి పండగ సందర్భంగా

పోలీస్ వారి విజ్ఞప్తి
సబ్ ఇన్స్పెక్టర్ నరేష్

అక్షిత న్యూస్, మాడుగులపల్లి :
సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్తున్న వారి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నల్గొండ ఎస్పీ రేమ రాజేశ్వరి ఆదేశాల మేరకు మాడుగులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ కైగూరి నరేష్ సిబ్బందితో కలిసి వేగ నియంత్ర బోర్డులను నార్కట్పల్లి అద్దంకి హైవేల పై ఏర్పాటు చేశారు వేగం కన్నా ప్రాణం మిన్న ప్రమాదాల నివారణకు అందరు సహకరించాలని కోరారు. అదేవిధంగా మాట్లాడుతూ
మండల ప్రజలు ఊరు వెళ్తే జాగ్రత్తగా ఉండాలని వీలైనంత మేరకు ఇంట్లో విలువైన వస్తువులు నగదు బంగారు ఆభరణాలు పెట్టుకోవద్దని వాటిని బ్యాంకు లాకర్లో లేదా భద్రత ఉన్నచోట దాచుకో వడం ఉత్తమమని తెలిపారు ఇంటిముందు తలుపులకు సెంట్రల్ లాక్ వేసి బయట పెట్టకండని ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచాలని బయటకి లోపల నుండి తాళం వేయాలని ప్రజలకు సూచించారు ఇంటి బీరువాలో ఎట్టి పరిస్థితులు నగదు మరియు బంగారు ఆభరణాలు పెట్టవద్దని ఊరికి వెళ్లేటప్పుడు మీకు నమ్మకమైన వారికి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని బయటకు వెళ్లేటప్పుడు వాకిట్లో ముగ్గు వేసేటప్పుడు మెడలోనీ బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలని మీ ఇంట్లో కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు మీ గ్రామాలలో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపిస్తే డయల్ 100కి కాల్ చేసి సమాచారం అందించాలని ఎస్సై కైగూరు నరేష్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking