సమస్త మానవాళి సుఖశాంతులతో జీవించాలని 91 వ విశ్వశాంతి మహాయాగంలో
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్
కల్వకుర్తి అక్షిత ప్రతినిధి
ప్రపంచంలోని సమస్త మానవాళి సుఖశాంతులతో జీవించాలని,వర్షాలు సమృద్ధిగా కృషి దేశం లోని రైతులు ప్రజలు వ్యాపారులు సమాజంలోని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని సంకల్పంతో కల్వకుర్తి పట్టణంలో 91 విశ్వశాంతి మహాయాగం కన్నుల పండుగగా అంగరంగ వైభవ్వేతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.వేదమంత్రోఛరణాలు మారు జీమ్రోగుతున్నాయి. వేద ఘోష కల్వకుర్తి పట్టణంలో అందరికీ వినిపిస్తోంది. హోమాలు, యాగాలు సర్వ మానవాళి మేలుకోసమే జరుగుతున్నాయి11 రోజులుగా యాగం నిర్విఘ్నంగా సాగుతోంది. బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులతో పాటు యాగ నిర్వాహకులు జూలూరు రమేష్ బాబు కుటుంబ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ దంపతులతో పాటు ప్రముఖులు పాల్గొని చండీ హోమం నిర్వహించారు. హోమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ పాఠశాలల విద్యార్థులు యాగశాల ప్రదక్షణ చేయడంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం, భక్తి పాటలు పాడడంతో పాటు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.బుధవారం చండీ హోమం,పాశుపత, శ్రీ సుదర్శన,లక్ష్మీనారాయణ హోమములు, సరస్వతి పూజలు, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు యాగ మహోత్సవంలో పాల్గొంటున్నారు. సామూహిక కుంకుమార్చనలో దంపతులు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పండితులు మానవాళి ఆనంద ఉత్సవాలతో ఉండాలని యాగాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో జూలూరు రమేష్ బాబు, బచ్చు రామకృష్ణ, బీచని బాలకృష్ణ,పోలా సురేందర్, మాచిపెద్ది రామస్వామి, జూలూరు ప్రకాష్, కల్మిచర్ల గోపాల్, చిగుళ్లపల్లి సతీష్, పసుల రమకాంత్ రెడ్డి,సంతు యాదవ్, మదన మురళి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు నాయకులు పాల్గొన్నారు.