64 ఏళ్ల వ్యక్తిలో అనీమియా ప్లేట్‌లెట్ల తగ్గుదలతో బైసైటోపీనియా
బోన్‌మారోకి యశోదలో అరుదైన చికిత్స
ఖమ్మం/అక్షిత బ్యూరో :
తరచూ జ్వరం తీవ్రమైన నీరసం పదేపదే రక్తం ఎక్కించాల్సిన పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న ఖమ్మంకు చెందిన 64 ఏళ్ల వ్యక్తికి మలక్ పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో అనీమియా థ్రాంబో సైటోపీనియాతో కూడిన బైసైటోపీనియా ఉన్నట్లు గుర్తించారు. పెరిఫెరల్ బ్లడ్ స్మెర్ లో లేవుకరీత్రో బ్లాస్టిక్ బ్లడ్ పిక్చర్ కనిపించింది.నెల రోజులుగా జ్వరం ఒళ్లు నొప్పులు నీరసం తదితర సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఆసుపత్రికి రాక ముందే ఒక్క నెలలో ఏడు యూనిట్ల పిఆర్బి సి ఎక్కించాల్సి వచ్చింది. కారణాన్ని తెలుసుకునేందుకు బోన్ మైరో ఆస్పిరేషన్ బోన్ మార్రౌ బయోసై నిర్వహించగా ప్రైమరీ మైలోఫిబ్రసిస్ (పీఎంఎఫ్ ) ఉండవచ్చనే సూచనలు కనిపించాయి. ఎన్ హెచ్పి ప్యానెల్ నెగటివ్ గా వచ్చింది.ఆసుపత్రిలో మరో మూడు యూనిట్ల లేవుకాడేప్లీటెడ్ పిఆర్బిసి అందించారు. చికిత్స మధ్యలో ఆయాసం జ్వరం ఎస్పివో 2 తగ్గడంతో ఐసీయూకు తరలించి బ్రాడస్పెక్ట్రమ్ ఆంటిబయోటిక్స్ తో పాటు సపోర్టివ్ కేర్ అందించారు. స్టేరోయిడ్స్ లిమిడ్స్ ఇంజక్టబుల్ ఈపిఓ తో చికిత్స ప్రారంభించడంతో పరిస్థితి క్రమంగా మెరుగుపడి హీమోడైనమికల్‌గా స్థిరపడింది. డా. ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ అనీమియా ప్లేట్‌లెట్లు తగ్గిపోవడంతో పాటు పదేపదే రక్తం అవసరమయ్యే రోగుల్లో కారణాన్ని తెలుసుకునేందుకు సమగ్ర హీమటాలజీ, బోన్‌మారో పరీక్షలు కీలకమన్నారు. ఈ రోగి బోన్‌మారో పరీక్షల్లో పీఎంఫ్ ఉండవచ్చనే సూచనలు కనిపించాయని తదుపరి మూల్యాంకనం నిరంతర ఫాలోఅప్ అవసరమని తెలిపారు. క్లిష్టమైన రక్త బోన్‌మారో సంబంధిత వ్యాధుల నిర్ధారణ చికిత్సకు హీమటాలజీ హీమటో-ఆంకాలజీ, క్రిటికల్ కేర్ సహా బహుళ విభాగాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని యశోదా ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.