ఖమ్మం నగరంలో సందడి చేసిన హృదయ కాలేయం ఫేమ్ సంపూర్ణేష్ బాబు

ఖమ్మం నగరంలో సందడి చేసిన హృదయ కాలేయం ఫేమ్ సంపూర్ణేష్ బాబు

ప్యారడైజ్ మూవీ ప్రమోషన్ లో బాగంగా ఖమ్మం వచ్చిన సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన నగర వాసులు

-అభిమానులతో కలిసి ఆయా షేర్ పాటకు డాన్స్ చేసిన సంపూర్ణేష్ బాబు

ఖమ్మం /అక్షిత బ్యూరో : ఖమ్మం నగరంలో హృదయ కాలేయం ఫేమ్ సంపూర్ణేష్ బాబు సందడి చేశారు. ప్యారడైజ్ మూవీ ప్రమోషన్ కోసం ఆయన ఖమ్మం వచ్చారు. ఆయనకు ఖమ్మం నగర వాసులు ఘన స్వాగతం పలికారు.అభిమానులతో కలిసి ఆయా షేర్ పాటకు ఆయన డాన్స్ చేశారు. ఇప్పటివరకు ఉన్న చేసిన సినిమాల కంటే ఇందులో తన పాత్ర భిన్నంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఖమ్మం నగర వాసులు ప్యారడైజ్ సినిమాను అందులో నటించిన ఆయన పాత్రను ఆదరించాలని ప్రజలను కోరారు. ఖమ్మం లో ప్యారడైజ్ మంచి ప్రమోషన్ కోసం పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు. ప్యారడైజ్ మూవీలో తన పాత్ర పేరు బిర్యానీ అని ఆయన పాత్రకు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియాలంటే సినిమా చూడాలని అభిమానులకు సూచించారు. సంపూర్ణేష్ బాబు వెంట సోదర మూవీ ఫేమ్ సంజోష్ పకోడా హబ్ యజమాని వంశీ శరత్ డెకర్స్ ఈవెంట్ శరత్ ఖమ్మం సిటీ04 ప్రేమ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking