నమ్మకాన్ని వమ్ము చేయను అంకితభావంతో పనిచేస్తా
సన్మానం పట్ల కట్కూరి శ్రీకాంత్ కృతజ్ఞతలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి
గచ్చిబౌలి టిఎన్ జీఓ మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్‌గా తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని టిఎన్ జీఓ హైదరాబాద్ సిటీ యూనియన్ అధ్యక్షుడు కట్కూరి శ్రీకాంత్ అన్నారు. అంకిత భావంతో పనిచేసి, మీ నమ్మకాన్ని నిలుపుకుంటానన్నారు. డైరెక్టర్‌గా ఎన్నికైన సందర్భంగా తనను సన్మానించి, అభినందించిన టిజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు సీనన్న, గౌరవ సభ్యులందరికి కట్కూరి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు.సభ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తూ, సొసైటీ సభ్యుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తానని శ్రీకాంత్ తెలిపారు.