సేవా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టుల రక్తదాన శిబిరం
– బండారు యాదగిరి జన్మదినం సందర్భంగా భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు
– అభినందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు
సంగారెడ్డి, అక్షిత బ్యూరో
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డి ఐబీలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, జెడ్పీ సీఈవో జానకి రెడ్డి, జిల్లా యువజన సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ తదితరులు రక్తదాన శిబిరం నిర్వహణను అభినందించారు.ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందన్నారు. గ్రామీణ జర్నలిస్టుల బస్‌పాస్‌లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. ఫైసల్ మార్గనిర్దేశంలో శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఫైసల్ మాట్లాడుతూ సంగారెడ్డితో పాటు పటాన్‌చెరు, జహీరాబాద్, సదాశివపేట, ఆందోల్, హత్నూర, నారాయణఖేడ్ ప్రాంతాల నుంచి జర్నలిస్టులు తరలివచ్చారని పేర్కొన్నారు. వార్తా సేకరణతో పాటు సామాజిక సేవలోనూ జర్నలిస్టులు ముందుండాలని అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ శ్రీహరి, బీజేపీ సీనియర్ నేత జగన్ యాదగిరిని శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనాథ్, మల్లేష్, కిషోర్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉలువల రాజు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, చిన్న మధ్యతరహా పత్రికల సంఘం అధ్యక్షుడు సిద్ధిక్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్, కోశాధికారి లక్ష్మణ్, సిరి దినపత్రిక సీఈవో శివశంకరరావు, రథసారథి దినపత్రిక సీఈవో సంతోష్ గౌడ్ పాల్గొన్నారు. సదాశివపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు హాజీ, పటాన్‌చెరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నరసింహ, ప్రధాన కార్యదర్శి యాదగిరి, పుల్కల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మల్లేశం, జిల్లా కార్యవర్గ సభ్యుడు శివన్న జైన్, ఇర్షన్, జరా సంఘం మహేష్‌తో పాటు కొంపల్లి విద్యాసాగర్, మ్యాడమ్ రాధాకిషన్, పుల్లూరి ప్రకాష్, కుందారం రాజయ్య, మనోహర్, ఆమెటి మహేందర్, దాచేపల్లి రవీందర్, పుర్ర రాములు, జోగన్నగారి యాదగిరి, సాహితీ స్కూల్ రవికుమార్ బుస్సా శ్రీనివాస్, రాచర్ల ప్రసాద్, కె.చంద్రశేఖర్, మాణిక్ ప్రభు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆమెటి కృష్ణ, సదాశివపేట జయరాములు గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కూన వేణు యాదగిరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
