ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం 

ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం 

-చౌటుప్పల్ టి.జి.ఆర్.ఎస్ ప్రిన్సిపల్ టి.విజిత

 చౌటుప్పల్ /అక్షిత న్యూస్ 

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పట్టణం బంగారుగడ్డ కాలనీలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో 2026- 27 విద్యా సంవత్సరానికి గాను 6,7,8 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి.విజిత గురువారం పత్రిక ఇచ్చిన ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చేనెల ఆగస్టు 3వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను చౌటుప్పల్ పట్టణం బంగారుగడ్డ కాలనీలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో పూర్తి చేసిన దరఖాస్తులను అందజేయాలని కోరారు. విద్యార్థులు దరఖాస్తు తో పాటు వారి ఆధార్ కార్డు, రెండు పాస్ ఫోటోలు, బోనఫైడ్ జిరాక్స్ కాపీలను తప్పనిసరి జత చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు సర్వేల్ లోని తెలంగాణ గురుకుల బాలుర పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తప్పనిసరి ఇట్టి అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking