బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు
– ముఖ్యఅతిథిగా జిల్లా బిజెపి అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
కొత్తగూడెం అక్షిత న్యూస్
కొత్తగూడెం భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర పార్టీల పిలుపుమేరకు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాకేష్ బాబు నేతృత్వంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యయి. బుధవారం మండల కేంద్రమైన లక్ష్మీదేవి పల్లి లోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా బిజెపి అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత బిజెపి జిల్లా నాయకులతో పాటు, కార్యకర్తలు శ్రీ రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి, దీపాలంకరణ చేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ “సమాజంలో సమతా భావాన్ని, సోదరభావాన్ని పెంపొందించడానికి సంత్ రవిదాస్ మహారాజ్ చేసిన సేవలను కొనియాడారు. అంతేగాక ఆయన అనుసరించిన విధానాలు, చేసిన సేవలు అనన్యసామాన్యమైనవన్నారు.కుల, మత రహిత సమాజ స్థాపన కోసం ఆయన తన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. అలాగే ఆయన చూపిన భక్తి మార్గం, సమతా సిద్ధాంతాలు నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమైనవని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంత్ రవిదాస్ ఆశయాలకు అనుగుణంగా ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ మంత్రంతో ముందుకు సాగుతోందని వెల్లడించారు.రవిదాస్ మహారాజ్ ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని నాయకులను కోరారు. తదానంతరం పెద్దలకు, గురువులకు శాలువా కప్పి సన్మానం చేసి స్వీట్లు తినిపించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, బిజెపి కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, యువ మోర్చా అధ్యక్షుడు మోహనకృష్ణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, ధార్మిక సెల్ అధ్యక్షుడు సుధాకర్, జిల్లా ఆఫీస్ కార్యదర్శి దొరిశెట్టి కుమార్, యోగ గురువు గుమలాపురం సత్యనారాయణ, నల్లగట్ల తిరుపతయ్య, ముత్యాల వంశీ, భూక్య మోహన్, బానోత్ కుమార్, వీర ప్రతాప్, చర్ల రమేష్ బాబు, నారపోగు రాఘవలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.