మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
అక్షిత ప్రతినిధి భూపాలపల్లి
వార్షిక తనిఖీల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. పెండింగ్ కేసుల పురోగతి,రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు.స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి,కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ,రౌడీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పారదర్శక సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. తనిఖీల్లో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహాదేవ్‌పూర్ సీఐ వెంకటేశ్వర్లు , ఎస్సై సాంబమూర్తి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.