ఆకునూరు రహదారిపై హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
చేర్యాల అక్షిత ప్రతినిధి:
చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యాల అరుణ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన 13 ఎజెండా అంశంలో 7 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపారు. ఇందులో ముఖ్యమైనవి పారిశుద్ధ్య కార్మికులకు (డ్రెస్సు) యూనిఫామ్ ల పంపిణీ, వర్షాకాలం దృష్ట్యా పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు, గుంతలు ఉన్న చోట రోడ్లపై మొరంతో పూడ్చివేతతో పాటు చేర్యాల అంగడి బజారు నుంచి ఆకునూరు గ్రామానికి వెళ్లే రహదారి ప్రమాదకరంగా ఉన్నందున, అట్టి రహదారిపై భారీ వాహనాల రాకపోగలను నియంత్రించేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.