ఎం పి తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన తెలంగాణ ఉద్యమ కారుల జే ఏ సీ

కరీంనగర్ అక్షిత బ్యూరో

తెలంగాణ ఉద్యమకారుల జే ఏ సీ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశం కరీంనగర్ లోని ఆక్సి్ఫర్డ్ హైస్కూల్ వద్ద జిల్లా అధ్యక్షులు బండ గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో సంఘ అభివృద్ధి కొరకు పలు తీర్మాణాలను ఆమోదించడం జరిగింది. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటమల్లయ్య మరియు జిల్లా అధ్యక్షులు బండ గోపాల్ రెడ్డి లు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చడం సరైంది కాదని, అతని అవగాహన లేని తనానికి ఇది నిదర్శనమని , ఆరు దశాబ్దాలు తెలంగాణ ప్రజలు ఆంధ్ర దోపిడికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని , నీళ్లు నిధులు నియామకాల కోసం రక్తతర్పణ చేసి ,1969 తొలి దశ ఉద్యమం లో 369 మంది ,మలి దశ ఉద్యమం లో 1200 మంది అమరవీరుల బలి దానంతో వచ్చిన తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చడం తేజస్వి సూర్య అవగాహన లేని తనానికి నిదర్శనమన్నారు , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కై జరిగిన ఉద్యమం లో తమ సమయాన్ని, డబ్బును త్యాగం చేసి అనేక కేసు లను ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ఉద్యమ కారులకు ప్రభుత్వం వెంటనే పెన్షన్ మంజూరు చేయాలన్నారు. ఈ సందర్బంగా నూతనంగా కార్యవర్గం లో చేరిన సభ్యులకు నియామకపత్రాలు అందించి అభినంధించినారు.ఈ కార్యక్రమంలో అలుగు కవిత, కుంట సుజాత, ఆసియా, పద్మారెడ్డి, సరోజన, లక్ష్మీనారాయణ, కిరణ్, బొప్పిశెట్టి కావ్య , వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking