కోలాహలం…సంక్రాంతి సంబరం

కోలాహలంగా సంక్రాంతి సంబురాలు షురూ…
* భోగి మంటలతో వెల్లివిరిసిన పండుగ వాతావరణం
* తెలుగు వారి సిరుల పండుగ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలి
* అందరి లోగిళ్ళలో ఆనంద సిరులు వెల్లివిరియాలి
* మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

యువనేత నల్లమోతు సిద్దార్ధ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో సంక్రాంతి సంబురాలు మిన్నంటేలా కోలాహలంగా మారాయని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. భోగి మంటలతో పండుగ వాతావరణం వెల్లివెరిసిందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళల కోలాటాల ప్రదర్శనలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలతో తెలుగువారి లోగిళ్ళలో ఆనంద సిరులు వెల్లివిరియాలని నల్లమోతు సిద్దార్ధ ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో నిత్యం కాంతులు విరాజిల్లేలా దేవతలంతా దీవించాలని, ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతీ ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరియాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలందరికీ భోగి…భోగభాగ్యాలను కలిగించాలని, మకర సంక్రాంతి…మనందరికీ సకల సంపదలు కలిగించి సుఖసంతోషాలతో తులతూగేలా చేయాలని, కనుమ….సకల జనుల, సబ్బండ వర్గాల కన్నుల పండువ కావాలని నల్లమోతు సిద్దార్ధ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల వల్ల రైతులందరి ఇండ్లు పాడిపంటలతో సుఖసంతోషాలతో వెల్లివిరియాలని కోరారు. ప్రజల్లో దాగివున్న చెడు
భోగి మంటల్లో పూర్తిగా నశించి ప్రజలంతా ఆయుర్ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని నల్లమోతు సిద్దార్ధ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking