బీఆర్ఎస్ లో భారీ చేరికలు,ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తాం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణంలో 34వ, 35వ వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద వెంకటేశ్వర్లు, దైద రాజుతో పాటు సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు ఉబ్బపల్లి మధుసూదన్, మాజీ కౌన్సిలర్ దైద సోముసుందర్ నేతృత్వంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.బీఆర్ఎస్ లో చేరిన నాయకులకు గులాబీ కండువాలను కప్పి నల్లమోతు భాస్కర్ రావు తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తున్నామని అన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం,డంపింగ్ యార్డు, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. గ్రామాల్లో గతంలో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళతో దర్శనమిస్తున్నాయని అన్నారు. అనేక మారుమూల గ్రామాల్లోనూ ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతున్నదని అన్నారు. ప్రతీ పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. గ్రామాల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. ఈ రెండు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 మేనమామ కట్నంగా ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తున్నదని అన్నారు. దశాబ్దాల భూవివాధాలను తెరదించి భూయజమానులకు హక్కులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ధరణీ పోర్టల్ ను రూపొందించిందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్ధిక భరోసా కల్పిస్తున్నదని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి కూడా బీఆర్ ఎస్లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని భాస్కర్ రావు కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఉపాద్యక్షులు బాసాని గిరి, షోయబ్, నల్లగంతుల నాగభూషణం, సర్పంచులు లావూరి శ్రీను నాయక్, దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఫయాజ్, శివ, దైద కృష్ణ, కందికంటి రమేశ్, విష్ణు, రాందాస్,ఈట గిరి, సైదులు, డి.సైదులు, వెంకటేశ్వర్లు,వెంకటేష్, రోహిత్, శశి, విజయ్, ఉబ్బపల్లి రాజు, దాసరి సతీష్, నాగరాజు, ఉదయ్, ప్రణీత్, శ్రీను,సైదులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking