బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న. ఎంపీపీ గుమ్మడి గాంధీ.

పినపాక అక్షిత ప్రతినిధి: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామ పంచాయతీ లో అంబేద్కర్ యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి అంబాల ప్రభు కుమార్. నియోజక వర్గ అధ్యక్షులు గద్దల వెంకటేశ్వర్లు, అద్వర్యం లో జరిగిన అంబేద్కర్ విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా విచ్చేసిన నవీన్ బాబు ఆర్మీ. పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ అపర మేధావి,మాల మాదిగల వర్గానికి పరిమితం కాకుండా యావత్తు భారతదేశంలోని ఉన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్. పూనెం సుజాత, ఉప సర్పంచ్ గుంటు పల్లి రామారావు. పూనెం సాంబయ్య, వెలదాండి రామస్వామి, గుమాస్ గోవర్ధన్, తాటి సంపత్ కుమార్, బిజ్జం వెంకట్ రామ్ రెడ్డి, నక్కల శ్రీనివాస్,గద్దల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking