కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేయడమే తమ లక్ష్యం అని ఉప్పల వెంకటేష్ అన్నారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇస్రాయి పల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 27 పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా సోమవారం నిరుపేద కుటుంబానికి చెందిన 1)రాచాలపల్లి జంగయ్య 2) బరిగల వెంకటయ్య ఇంటి నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన ట్రస్టు ద్వారా ఇటుక డస్ట్ సిమెంటు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన రాచాలపల్లి జంగయ్య, బరిగల వెంకటయ్య, కుటుంబ సభ్యులు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజిజ్ నాయకులు వి రాజు, ఆర్ రాజు, ఆర్ రాములు, ఎద్దుల వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు