ఆడపిల్లలను పుట్టనిద్దాం ఎదగనిద్దాం చదువనిద్దాం

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన భేటీ బచావొ భేటీ పడావొ కార్యక్రమాని ఎంపిపి నిర్మల శ్రీశైలం గౌడ్ మరియు సిడిపివొ సక్కుబాయి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఆడపిల్లలను పుట్టనిద్దాం ఎదగనిద్దాం చదువనిద్దాం అనే నినాదంతో విద్యార్థినిలతో కలిసి ర్యాలి నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో బృూణ హత్యలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకరావాలన్నారు.నాటి నుండి నేటి వరకు అన్ని రంగాలలో అనేక రకాలుగా మహిళలు ఆడపిల్లలు అణచివేతకు గురవుతున్నారు.సొంత కుటుంబీకులే వావి వరసలు మరిచి అత్యాచారాలకు పాల్పడుతున్నప్పుడు ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుందని బాధ వ్యక్తం చేసారు.తొమ్మిది నెలల పాప నుండి అరవై ఏళ్ళ ముసలోల్ల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి.అమాయకమైన ఆడపిల్లల పట్ల గౌరవం పెరిగేలా వారికి చేయూతనందించి ముందుకు నడిపే దిశగా సమాజంలో మార్పు రావాలని ఆడపిల్లలను చదివించి ఉన్నత స్థానాలలో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా వారు తెలియపరిచారు .ఈ కార్యక్రమంలో వారితో పాటు డాక్టర్ కల్పన,సర్పంచ్ లలిత జ్యోతయ్య,ఎంపిటీసి హేమరాజు సూపర్వైజర్లు తిరుమల,కవిత,పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకులు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking