అలుపెరగని పోరాట వీరుడు నేతాజీ

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

భారతదేశాన్ని బందీలుగా ఉంచే శక్తి ఈ భూమ్మీద లేదు. నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వేచ్ఛనిస్తాను అంటూ  భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి పోరాడటంతో పాటు భావి తరాల హృదయాలలో దేశభక్తిని పెంపొందించిన అలుపెరుగని పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం జి. నరసింహ అన్నారు.సోమవారం కక్కిరేణి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ తెల్లదొరల పాలన అంతం కావడానికి ఒక్క అహింసా మార్గం సరిపోదని సాయుధ పోరాటం బాట పట్టిన గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడని  భావి తరాలకు ఈయనే ఆదర్శం.  జాతీయవాద భావాలు బ్రిటీష్ వలస పాలన నుంచి సాతంత్య్రం రావడానికి ఎంతగానో సహాయపడ్డాయి. అలాగే యువతరాల  హృదయాలలో దేశభక్తిని పెంపొందించాయి.అని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భద్రయ్య , సైదులు , రమేష్  ,సామాజిక కార్యకర్త వేముల సైదులు ,  కన్నబోయిన సత్యనారాయణ , విద్యార్థినీ విద్యార్థులు సిద్దు , నవీన్ , జగదీష్ , విఘ్నేష్ , మీనాక్షి , శిల్ప , శ్రీజ  తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking