
జర్నలిస్ట్ రాజ్ కుమార్ మృతికి పలువురు సంతాపం
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
కొత్తగూడెం ఏబీఎన్ రిపోర్టర్ రాజ్ కుమార్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. మంగళవారం జూలూరుపాడు మండలంలో ఉన్న రాజు నివాసానికి పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వెళ్లి రాజ్ కుమార్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం రేగా కాంతారావు ఏబీఎన్ రాజు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా బిజెపి రాష్ట్ర నాయకులు సంఘ సేవకుడు కె.వి.రంగా కిరణ్ లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ లగడపాటి రమేష్, టెంజు జిల్లా అధ్యక్షులు వట్టి కొండ రవి వీరితోపాటు జడ్పిటిసి పోశం నరసింహారావు, నాయకులు భాస్కరరావు, యూసఫ్, హనుమంతు తదితరులు రాజు మృతదేహం వద్ద నివాళులు అర్పించారు.