గుడిసె వాసులకు పట్టాలివ్వాలి గచ్చిబౌళి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 

గుడిసె వాసులకు పట్టాలివ్వాలి గచ్చిబౌళి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జీ.పి.ఆర్ ఎదురుగా 25సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద గుడిసె వాసుల కి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నపళంగా జీ. ఎచ్ ఎం సి అధికారులు, సిబ్బంది డిమలేసన్ టీమ్ వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్న విషయం తెలుసుకున్న గచ్చిబౌళి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తన అనుచరులతో కలసి కార్యాలయం నుండీ బాధితుల స్థలానికి చేరుకుని వారి ఆందోళన కార్యక్రమము కీ మద్దతు తెలుపుతూ వారికీ తక్షణమే ప్రతన్మయంగా ఇళ్ళ స్థలాల నీ కేటాయించాలి అని నినాదం తో కార్యక్రమము చేపడుతున్నట్టు సమాచారం తెలుసుకున్న చందా నగర్ పోలీసులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆయన అనుచరులను ముందస్తుగా అయన కార్యాలయంలో అదుపులోకి తీసుకుని హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకీ ఎన్నికల్లో గెలవడం కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పేదల ఉన్న ఇళ్లను నేలమట్టం చేయడం సిగ్గుచేటు అని అన్నారు భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులూ రవికుమార్ యాదవ్ బాధితులకు అండగా ఉండడానికి కూల్చి వేస్తున్న ప్రదేశంలో నిరసన కార్యక్రమం చేపడుతుండగా ఆయనను అరెస్ట్ చేశి నార్సింగి పోలీస్ స్టేషన్ కీ తరలించారు అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమములో గంగాధర్ రెడ్డి తో పాటు రంగస్వామి, శేఖర్,చిన్న, టీంకు, క్రాంతి,నర్సింహా, విష్ణు, తిరుపతి లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking