ప్రజాస్వామ్య ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రజాస్వామ్య ఓటు హక్కును వినియోగించుకోవాలి

అక్షిత న్యూస్ నెక్కొండ :

జనవరి 25 జాతీయ13 వ ఓటరు దినోత్సవం సందర్భంగా

భారతదేశం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం.

స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారి కాలంలో

డిగ్రీ పట్టబద్రులకు.కొన్ని కులాలకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. భారత రాజ్యాంగం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల . మతం. ప్రాంతం. వర్గం. తేడాలు లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించడం జరిగింది.నోట్లకు ఓట్లు

విధానం మారాలిఎన్నికల సమయంలో

ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఖర్చు వివరాలకు మరియు పోటీ చేస్తున్న అనధికార ఖర్చులు అయినా ప్రచారం కోసం . ప్రజల నుండి ఓట్లు రాబట్టడం కోవడం విందులు. విహారయాత్రలు. నోట్లను కొనుక్కోవడం

అనే విధానం మారాలి.పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క అనాధికార ఖర్చులు లక్షలు . కోట్లలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల సమయానికి ప్రతి ఎన్నికలకు జనాభా పెరిగిన రీతిలో. ఓట్ల సంఖ్య పెరిగి అభ్యర్థుల యొక్క ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. సామాన్య మానవుడు

ఎన్నికలలో పోటీ చేసే విధానం ఎన్నికల వాతావరణం రావాలి.

అబ్రహం లింకన్ అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యానికి

ఇచ్చిన కొటేషన్ ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వ వ్యవస్థ.బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది అని వివరించడం జరిగింది 2. చోట్ల ఓటు హక్కలు

ఓటు హక్కు కలిగిన ప్రజలు ఉపాధి నిమిత్తం. ఉద్యోగాల నిమిత్తం. స్థిర ఆస్తులు కలిగిన వారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్లినవారు తన సొంత గ్రామం తో పాటుగా ఇతర ప్రాంతాలలో కూడా ఓటు హక్కు కలిగి ఉండడం వలన 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారిని లెక్కించి ఆధార్ కార్డు ప్రమాణికంగా ఒక్కరికి ఒక్క చోటునే ఓటు హక్కు ఉండే విధంగా ఎన్నికల కమిషన్ నిబంధనలను రూపొందించాలి.

విద్యార్థులకు. నూతన ఓటర్లకు చైతన్య కార్యక్రమాలు

నేటి విద్యార్థులే రేపటి పౌరులు కనుక హై స్కూల్. కళాశాల. ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై ఓటు హక్కు. ప్రజా ప్రతినిధి. ప్రభుత్వ పరిపాలన వంటి అంశాలపై మాక్ పార్లమెంటు ప్రతి విద్యా సంస్థలలో నిర్వహించాలి. గత కొన్ని సంవత్సరాల క్రితం హై స్కూల్ విద్యార్థులకు క్లాస్ లీడర్ ఎన్నికల కోసం సి ఆర్ ఎన్నికలు జరిగేవి. కొన్ని ఉన్నత విద్యా సంస్థలలో. యూనివర్సిటీలలో విద్యార్థి ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న రాష్ట్ర. జాతీయ నాయకులకు కూడా విద్యార్థి. యువజన స్థాయి నుండి ఓటు హక్కు.ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగి ఉన్నారు.

రాజకీయ పార్టీలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు. దేశస్థాయిలోనే రాజకీయ పార్టీలు రాజ్యాంగం ప్రకారంఎన్నికల కమిషన్ వద్ద

నిబంధనల ప్రకారం,నమోదు చేసి ఉన్నాయి. కనుక ఓటు హక్కు పై ప్రతి రాజకీయ పార్టీ ప్రభుత్వ అధికారులతో పాటుగా ప్రతి రాజకీయ పార్టీ కూడాఓటు హక్కు నమోదుపై. ప్రజలకు,యువతకు.18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి రాజకీయ పార్టీలు కూడా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది.

స్వచ్ఛంద సంస్థలు భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది.

దేశ అభివృద్ధికి ప్రజాస్వామ్యం లో ఎన్నికలు ఓటు హక్కు వినియోగం చాలా ముఖ్యమైనది కనుక

స్వచ్ఛంద కార్యక్రమంగా ఓటు హక్కు చైతన్యం కోసం

స్వచ్ఛంద సంస్థలు కూడా చైతన్యం కలిగించాలి

తెలంగాణ రాష్ట్రంలో.9 నవంబర్ 2022 రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన మొత్తం ఓటర్ల సంఖ్య

2,99,74,919 . దాదాపుగా 3 కోట్లమంది ఓటర్లు రాబోయే ఎన్నికలలో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో

పురుషులు 1,50,74,919 మంది.

మహిళలు 1,49,24,719 మంది.

థర్డ్ జెండర్. 1951.

వీరితో పాటుగా

ఎన్. అర్. ఐ. లు 2740 మంది.

సర్వీసు ఓటర్లు 15,282 మంది ఉన్నారు గతంలో జరిగిన 2018 ఎన్నికలలో మొత్తం ఓటర్ల సంఖ్య  2,80,76,369 మంది .రాష్ట్రంలో 1952 లో మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. 2018 లో శాసనసభ ఎన్నికలు. 2019 లో 17 వ లోక్ సభ ఎన్నికలు జరిగినాయి. భారత రాజ్యాంగంలో 6వ విభాగంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికల గురించి ఆర్టికల్ 168 నుండి 212 వరకు వివరించడం జరిగింది.భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 326 లో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking