ఆలయ అభివృద్ధికి 50లక్షలు మంజూరు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి:ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
ఆలయ అభివృద్ధికి 50లక్షలు మంజూరు
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి:ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
మేళ్లచెరువు,అక్షిత ప్రతినిధి:
ఫిబ్రవరి నెల18నుండి 22వ తారీఖు వరకు జరిగే మహాశివరాత్రి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ మోహన్ రావు ఆధ్వర్యంలో శివాలయ ఆవరణలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు.జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండాచూడాలన్నారు. ఆరోగ్య శాఖ, విద్యుత్, పంచాయితీ సిబ్బంది వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి జాతర విజయవంతానికి సహకరించాలన్నారు.స్థానిక సిమెంట్ పరిశ్రమల యజమానులు జాతర అభివృద్ధి పనులకు సహకరించాలన్నారు.జాతర నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ రెడ్డి, తహశీల్దార్ దామోదర్ రావు,ఎంపిడిఓ ఇస్సాక్ హుస్సేన్,కోదాడరూరల్ సీఐనాగదుర్గా ప్రసాద్,ఎస్సై సురేష్,విద్యుత్ శాఖ డీఈ వెంకటకృష్ణయ్య,పంచాయితీ డీఈ వెంకటేశ్వర్లు,ఎంపిఓ కే వీరయ్య,మండల వైద్యాధికారి ప్రేమ్ సింగ్,పంచాయితీ సెక్రటరీ నారాయణ రెడ్డి,ఆలయ ఈఓ కొండారెడ్డి,అర్చకులు విష్ణు వర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ,వివిధ పరిశ్రమల అధికారులు,ప్రజాప్రతినిధులు, స్థానికులుతదితరులు పాల్గొన్నారు.