ఘనంగాజాతీయ బాలల దినోత్సవం చిన్నారులకురంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పలువురికి ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,

ఘనంగాజాతీయ బాలల దినోత్సవం

రంగారెడ్డి అక్షిత ప్రతినిధి: జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకురంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పలువురికి ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రతి జాయిన్, మంచాల మండలం చీదేడుగ్రామానికి చెందిన వైష్ణవి 2021 సంవత్సరంలో కరోనా అనంతరం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని దేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణకు ఉత్తరంరాసిన ఎనిమిదవ తరగతి విద్యార్థి వైష్ణవి. ఉత్తరం చదివిన దేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చీదేడు గ్రామానికి వెంటనే బస్సు సేవలను పునరుద్దాలని టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ ఆదేశాలు ఇవ్వడంతో గ్రామానికి బస్సు పునరుద్ధరించడం జరిగింది. అప్పట్లో పలువురు ప్రశంసలు అందుకున్న చిన్నారి వైష్ణవికి జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం,3000 రూపాయల పారితోషికాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సుశీందర్రావు,రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking