అధికారుల అలసత్వం కాంట్రాక్టుల ఇష్టారాజ్యం

అధికారుల అలసత్వం కాంట్రాక్టుల ఇష్టారాజ్యం

మునుగోడు ,అక్షిత ప్రతినిధి:

అధికారుల పర్యవేక్షణ లేకుండా మునుగోడు మండల కేంద్రంలో నాలుగో వార్డులో గార్లపాటి శ్రీను ఇంటి సందు నుండి కరెంట్ ఆఫీస్ వరకు సిసి రోడ్డు పనుల నిర్మాణం నూతనంగా చేపట్టారు. సిసి రోడ్డు పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వైనం, కొంతమంది కాంట్రాక్టర్లు గతంలో వేసిన సిసి రోడ్డు నాణ్యత లోపంతో నిర్మాణం పనులు పూర్తిచేసుకుని దానికి సంబంధించిన బిల్లును తీసుకొని మళ్లీ అదే సిసి రోడ్డును కొత్త బడ్జెట్లో ప్రవేశపెట్టి అట్టి బిల్లును దుర్వినియోగం చేయాలని చూస్తున్న కాంట్రాక్టర్లను సంబంధింత అధికారులు వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలంటూ, గ్రామంలో ఉన్న ప్రజలు, యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎస్ డి ఎఫ్, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులు మునుగోడు మండల కేంద్రానికి దాదాపు రెండు కోట్ల యాభై లక్షల నిధులు మంజూరైనట్టుగా సమాచారం ఇట్టి నిధులను సక్రమమైన పద్ధతిలో గ్రామ అభివృద్ధికి తోడ్పడేటట్లుగా చూడమని సంబంధిత అధికారులకు మునుగోడు గ్రామ ప్రజలు, యువత కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking