కేంద్ర,రాష్ట్రాలు బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి ఏఐఎస్ఎఫ్
వరంగల్ ,అక్షిత బ్యూరో : వరంగల్ శివనగర్ తమ్మర భవన్ ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఖీలా వరంగల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ల్యాదాల్ల శరత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేంద్ర బడ్జెట్లో విద్యకు 10% నిధులు రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30% నిధులు ఇవ్వాలని కొఠారి కమిషన్ సిఫార్సు చేసిన 
కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యారంగం పట్ల చిన్నచూపు చూస్తున్నాయని కేంద్ర బడ్జెట్లో గత రెండు సంవత్సరాల నుంచి విద్యకు మూడు శాతం మించి నిధులు ఇవ్వడం లేదని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల విద్యకు నిధులు తగ్గిస్తూ వస్తుందని 2014 15 బడ్జెట్లో 10.89% శాతం నిదుర కేటాయించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ తర్వాత సంవత్సరాల నుంచి విద్యకు ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తున్నారని గత రెండు సంవత్సరాల బడ్జెట్లో విద్యకు నిధులు ఆరు శాతం పెంచడం లేదని బిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో దేశంలోని కేరళ మహారాష్ట్ర పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో 25% పైగా నిధులు కేటాయిస్తున్న మన రాష్ట్రంలో ఇలా ఆరు శాతం కేటాయిస్తూ మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల ఆదర్శంగా తీసుకోమని చెప్పడం చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు 30% నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం 10% నిదురి కేటాయించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండలాల నాయకులు శ్రీరామ్ ప్రశాంత్ రాము కిషోర్ శివకుమార్ సోను శ్రవణ్ రాకేష్ తదితర నాయకులు పాల్గొన్నారు