*వరంగల్ నగరం లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ*
*వరంగల్ నగరం లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.
ఉపాధి అవకాశాలు కల్పించాలి
సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ*
వరంగల్ ,అక్షిత బ్యూరో : వరంగల్ జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోలేబర్ కాలనీ 100 ఫీట్ల రోడ్డు నుండి వెంకట్రామ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు అక్కనపల్లి యాదగిరి మాట్లాడుతూ వరంగల్ నగరంలో చిన్న తరహా భారీ పరిశ్రమ లు ఏర్పాటు చేయాలి ఉపాధి అవకాశ లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 2023 24 బడ్జెట్లో ప్రత్యేకంగా పరిశ్రమల కోసము నిధులు కేటాయించాలని పరిశ్రమలు స్థాపించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతంలో చిన్న తరహా మధ్యతరహా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడే ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి డిగ్రీ పీజీలు ఉన్నత విద్య పూర్తి చేసి సంవత్సరాలు గడిచిన ఎట్లాంటి ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈప్రాంతంలో ప్రజలకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది తక్షణమే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని యాదగిరి డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో రైల్వే పరిశ్రమలు గాని లేజర్ పరిశ్రమలు గాని పత్తి స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్లులు గాని కాటన్ మిల్లులు గాని అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వము రైల్వే బడ్జెట్ లో వరంగల్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనుమాముల మార్కెట్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 1000 మంది నిరుద్యోగులు మహిళలు పేదలు పాల్గొన్నారు స్థానిక నాయకులు ఎస్కే పాషా ఇల్లందుల అనిత కంది రవి భద్రయ్య రవిరాకుల ప్రసంగి నగేష్ కళావతి మంజుల సిపిఎం శాఖా కార్యదర్శులు జన్ను ప్రమోద్ జనగామ శ్రీనివాస్ బొంపెల్లి అశోక్ జన్ను ప్రవీణ్ చెలు పూరి మల్లికార్జున్ చిలువేరు సుస్మిత చిన్న మల్ల కల్పన కందికొండ శైలజ ప్రస్తుతం కొమరమ్మ గౌరీ ప్రియ తదితరులు పాల్గొన్నారు