డిజిటల్ లైబ్రరీ ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
పినపాక అక్షిత ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ నందు సుమారు 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించుకున్న డిజిటల్ లైబ్రరీ ని ప్రారంభించిన పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డిజిటల్ లైబ్రరీ ని విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఎంతో గాను ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలన్నారు. డిజిటల్ లైబ్రరీలో కాన్ఫరెన్స్ హాల్ మీటింగ్ హాల్ సంపూర్ణ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులకు తీసుకువచ్చామన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బచ్చల భారతి, ఎంపీపీ కారం విజయ కుమారి, జెడ్పిటిసి పోశం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.